KDP: వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ వైద్యనాథ స్వామి ఆలయానికి పడమర దిశగా అర కిలోమీటర్ దూరంలో అరుదైన నాగేశ్వర శివలింగాన్ని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ గుర్తించారు. సర్పం చుట్టుకున్న ఈ శివలింగం ప్రత్యేకతను ఆయన తెలిపారు. ప్రముఖ శిల్పి ఏమని శివనాగిరెడ్డి ప్రకారం, ఆలయం శిథిలావస్థలో ఉందని, ఇది 16వ శతాబ్ద నాటిదని, పునఃప్రతిష్ఠ అవసరమని మంగళవారం స్పష్టం చేశారు.