ATP: గుంతకల్లు విద్యుత్ ఏడి కార్యాలయంలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఈనెల 17 నుంచి నిరోధిక సమ్మె ఆందోళన కార్యక్రమాల కరపత్రాలను సీఐటీయూ నాయకులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి రేపటి నుంచి జరిగే ఆందోళన కార్యక్రమాలకు తమ వంతు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటామన్నారు.