NTR: కంచికచర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 8 మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ ఆశ్రపున్నీసా బేగం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. AP ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను పరిశీలించి, క్యూఆర్ కోడ్, బ్యాచ్ నెంబర్ ఆధారంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన మద్యం షాపు నిర్వాహకులపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.