కృష్ణా: దీపావళి పండుగ సందర్భంగా అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో బాణాసంచా షాపులు ఏర్పాటు చేయడానికి అనుమతులు లేవని ప్రిన్సిపల్ ఉమారాణి గురువారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కళాశాల మైదానంలో ఎలాంటి బాణాసంచా షాపులకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, కావున డిగ్రీ కళాశాలలో షాపులు పెట్టుకోవడానికి వీలులేదని ఆమె స్పష్టం చేశారు.