NLG: నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న దుబ్బ మాధవి (45) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. తాను చనిపోయినా వేరొకరి జీవితంలో వెలుగులు నింపాలని ఆమె నేత్రదానానికి అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో లయన్స్ క్లబ్ సభ్యులు నేత్రాలను సేకరించారు.