AKP: కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నుంచి సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజులు పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. పంచాయతీలకు వనరులు సమకూర్చుకోవడం,ఆర్.జీ.ఎస్.ఏ. వార్షిక కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పిస్తామన్నారు.