SKLM: ఎచ్చెర్ల మండలం ఫరిదిపేట గ్రామానికి చెందిన ఎం. చిరంజీవి నిరంతరం గొడవలు సృష్టించడంతో పోలీసుశాఖ చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కట్టిన చర్యలు ఉంటాయన్నారు.