KRNL: గార్గేయపురం చెరువులో ఏప్రిల్ 2న జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ఇవాళ తెలిపారు. అండర్-15, 18 విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన వారు ఏప్రిల్ 11-12 తేదీలలో NTR జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆసక్తిగల క్రీడాకారులు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.