»Babus Loss Of Life With Lokesh Kottu Satyanarayana
Babuకు లోకేశ్‌తో ప్రాణహానీ..?: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కుమారుడు లోకేశ్ నుంచి ముప్పు ఉందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణాలను కూడా వివరించారు.
Babu's loss of life with Lokesh: Kottu Satyanarayana
ChandraBabu: స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు (ChandraBabu) ఆరోగ్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని భువనేశ్వరి ట్వీట్ చేయగా.. బ్రాహ్మణి కూడా సపోర్ట్ చేసింది. ఆ వెంటనే జైలర్ వివరణ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీసింది.
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు (ChandraBabu) గురించి ప్రస్తావించి.. బాబుకు ఏమైనా జరిగితే అందుకే నారా లోకేశ్ బాధ్యుడు అవుతారని తెలిపారు. చంద్రబాబుకు (ChandraBabu) ఇంటి నుంచి భోజనం వస్తోందని.. ఆ భోజనంలో ఏమైనా కలిపి ఉండొచ్చనే సందేహాం వ్యక్తం చేశారు. జైలర్ ఏమో కేజీ పెరిగారని చెబుతారు.. అతని కుటుంబ సభ్యులు మాత్రం బరువు తగ్గారని ఎలా చెబుతారని అడిగారు.
చంద్రబాబు (ChandraBabu) ప్రాణాలకు లోకేశ్ నుంచి థ్రెట్ ఉందని.. అందుకు గల ఉదహరణను కూడా వివరించారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జరిగినట్టే జరిగే అవకాశం లేకపోలేదని తెలిపారు. ఆ తర్వాత బాబును కుటుంబ సభ్యులే హత్య చేస్తారనే భయం ఉందన్నారు. తండ్రిని చంపిన భర్త చంద్రబాబుతో (ChandraBabu) భువనేశ్వరి కలిసి ఉన్నారని.. మరీ ఇప్పుడు కుమారుడు తండ్రిని చంపే అవకాశం లేకపోలేదని కామెంట్స్ చేశారు. కొట్టు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో దుమారం చెలరేగుతోంది.