VSP: GVMC 9వ వార్డు సంజయ్ గాంధీ కాలనీలో ఆదివారం కరాటే బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమం జరిగింది. వార్డ్ ఇన్ఛార్జ్ బుడుమూరి గోవింద్ పాల్గొని విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే శారీరక దృఢత్వం, ఆత్మరక్షణతో పాటు మానసిక క్రమశిక్షణను పెంపొందించే మార్షల్ ఆర్ట్ అని తెలిపారు.