PPM: గుమ్మలక్ష్మి పురంలో శనివారం స్దానిక పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో పలు కాలనీలలో ‘సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రజకవీధి, చింతల గూడ, పెంకుటిల్లు కాలనీలలో చేతిపంపు మరమ్మతులు జరిపినట్లు సర్పంచ్ గౌరీశంకర్రావు పేర్కొన్నారు. గ్రామంలో ఎక్కడైనా బోర్లు పాడైపోయి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని కూడా బాగు చేయిస్తామని తెలిపారు.