తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ నెల 27న డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పోస్టల్ సేవలకు సంబంధించిన సమస్యలను ప్రజలు నేరుగా తెలియజేయవచ్చు. హాజరు కాలేని వారు 26 లోపు తమ ఫిర్యాదులను లేఖ ద్వారా పంపాలని అధికారులు సూచించారు.