కోనసీమ: పారిశుధ్య నిర్వహణ పై మరింత దృష్టి సారించాలని పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట పట్టణం 20వ వార్డు వైస్సార్ కాలనీ పంట కాలువ వెంబడి ఉన్న మట్టి దిబ్బలు జెసిబి, ట్రాక్టర్ సహాయంతో తొలిగించే పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి గురువారం పరిశీలించారు. ఎప్పటి కప్పుడు చెత్త తరలింపుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.