TPT: జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, శ్రీ సిటీ పరిశ్రమల విస్తరణకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి పనులను గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.