VZM: మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం మంగళవారం నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 63 యూనిట్ల రక్తం సేకరించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. రక్తదానం చేసిన వారికి రెడ్ క్రాస్ సర్టిఫికేట్లు అందజేశారు.