ప్రకాశం: వైసీపీ గిద్దలూరు నగర పంచాయతీ కన్వీనర్‌గా మానం బాలరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంగా బాధ్యతలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.