అన్నమయ్య: రాయచోటిలోని రాయుడు కాలనీలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి “వాక్ విత్” కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్ల సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయగా, వెంటనే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగతావాటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.