ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత వైభవంగా పుంగనూరులో జరిగే సూటూరు గంగమ్మ జాతరకు సంబంధించి కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అన్నమయ్య జిల్లా SP ధీరజ్ సూచించారు. ఆదివారం పట్టణ సీఐ సుబ్బరాయుడుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాటు చేసిన క్యూలైన్లను పరిశీలించారు. అమ్మవారి ఆలయ్య ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.