TPT: నారాయణవనం మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను శనివారం ఉదయం జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్ పరిశీలించారు. పనులు 60% పూర్తయ్యాయని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి ముందే గదులు సిద్ధం చేయాలని, బిల్లులు సకాలంలో చెల్లించేలా అధికారులు సహకరించాలని కోరారు.