BPT: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పప్పుధాన్యాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో మినుములు, పెసలు, శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.