విశాఖలో జరగనున్న నీతి ఆయోగ్ ప్రాంతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ ఏర్పాట్లు సమన్వయంతో చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్చి 9, 10వ తేదీల్లో రుషికొండలోని ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్లో జరిగే సెమినార్కు దక్షిణాది రాష్ట్రాలు ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.