VKB: విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టిక ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆయన తుంకులగడ్డ గిరిజన గురుకుల పాఠశాలతో పాటు చిగురాల్పల్లి, గోవిందాపూర్ గ్రామాలను సందర్శించారు. పాఠశాల వసతులను పరిశీలించి, విద్యార్థుల ఆరోగ్య విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.