NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని గుర్తుపెట్టుకుంటామని ఆయన అన్నారు.