TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం VIP విరామ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యకరమాలు ప్రజల చేరువయ్యేలా చూడాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు.