W.G: నరసాపురంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం సఖీ సురక్ష మెగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించి మాట్లాడారు. మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని, వైద్యులు చెప్పిన సలహాలు తప్పక పాటించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.