NDL: పట్టణంలోని దుర్గాపేట కాలనీలో మహిషాసురమర్ధిని అమ్మవారికి భక్తులు బంగారు తాళిబొట్లను శుక్రవారం సమర్పించారు. ఎర్ర భాపల వెంకటరమణ కుటుంబ సభ్యులు రూ.64 వేల విలువైన బంగారు తాళిబొట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.