PLD: నరసరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సీడీపీఓ కాంతా కుమారి తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తల 2 పోస్టులు, సహాయకురాళ్ల 7 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మహిళలు అర్హులని తెలిపారు.