పల్నాడు జిల్లా నరసరావుపేటలో గుడ్ ఫ్రైడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐదో వార్డు క్రిస్టియన్ పాలెంలో నిర్వహించిన శిలువ యాత్రలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ పాల్గొన్నారు. ముళ్ళ కిరీటం ధరించి సిలువను మోస్తూ యాత్రలో ఆయన ప్రత్యేకంగా ఆకర్షణంగా నిలిచారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులు కూటమి నాయకులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.