చిత్తూరు: వెదురుకుప్పం (M) పెరుమాళ్లపల్లి పాఠశాల సమీపంలో సోమవారం సాయంత్రం భారీ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు.. వెదురుకుప్పం నుంచి పళ్లిపట్టుకు భారీ కలప లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ స్పీడ్ బ్రేకును దాటేసమయంలో ట్రాలీ ఒక్కసారిగా రెండుగా విరిగి బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులకు పెను ప్రమాదమే తప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.