W.G: మొగల్తూరు మండలంలోని శేరేపాలెంలో రూ.2.5 కోట్లతో నిర్మించిన బీటీ రహదారిని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి రహదారులే వెన్నెముక అని, ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, గ్రామస్థులు పాల్గొన్నారు.