PPM: పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇవాళ పార్వతీపురం పట్టణంలోని చర్చి వీధిలో గల డీవీఎం పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను పరిశీలించారు.