ప్రకాశం: కనిగిరి ఆకృతి షాపింగ్ మాల్లో చోరీ చేసిన నిందితుడు వడ్లమాను శివారెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సందీప్ మంగళవారం తెలిపారు. అతని వద్ద నుంచి రూ.9.49 లక్షల నగదు, 30 గ్రాముల బంగారం, మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పోలీస్ సిబ్బందిని అభినందించారు.