డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒకరోజు మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం జిల్లా కమిటీ ఇవాళ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. రేపు జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.