ASR: డుంబ్రిగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ఎల్.సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మహిళా వార్డెన్, మహిళా ఉపాధ్యాయురాళ్లను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని వెళ్తున్నారన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు.