SS: చిలమత్తూరు మండలం లాలేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయం ఈ నెల 24న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గ్రామస్తుల కోరిక మేరకు చిన్నన్నపల్లికి చెందిన రమేష్ రెడ్డి రామాలయానికి ఎలక్ట్రానిక్ కంచు డోలు, వాయిద్యాన్ని శనివారం రాత్రి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా లాలేపల్లి గ్రామస్తులు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.