KRNL: కల్లూరులో అంగన్వాడి టీచర్ పి. పద్మావతి అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతదేహం దగ్గరకు సీఐటీయూ నాయకులు వెళ్లి నివాళ్లు అర్పించారు. అంగన్వాడి ఐసిడిఎస్ తరఫున రావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని ఎండి అంజిబాబు, పిఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. అనంతరం పద్మావతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.