ATP: ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో పండించే నాణ్యమైన మిర్చికి ఐరోపా, అమెరికా దేశాల్లో ఆదరణ పెరుగుతోంది. విదేశీ కంపెనీలు సాగుకు ముందే ధర ఖరారు చేస్తూ ఒప్పందాలు కుదుర్చుకోవడంతో రైతులకు స్థిర ఆదాయం లభిస్తోంది. ఏటా 15 వేల టన్నుల మిర్చి ఎగుమతి అవుతోంది. క్వింటాకు రూ. 23 వేల వరకు ధర లభిస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.