NLR: కందుకూరు మండలం మోపాడు సమీపంలో గురువారం రాత్రి రహదారిపై బైక్ అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.