VZM: ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిచేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఈ రోజు టీడీపీ క్యాంపు కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.