కోనసీమ: అమలాపురం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్డీవో ఆఫీసులో ‘వన్ మంత్-వన్ కాన్సిటెన్సీ-ఫోర్ విజిట్స్’ విధానంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ మహేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.