KRNL: వెల్దుర్తి మండలం పుల్లగుమ్మిలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో వివిధ పంటలపై రైతులకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న, కంది, మిరప, ప్రత్తి పంటలపై సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులపై ADA వెంకటేశ్వర్లు అవగహన కల్పించారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ కోసం అధికారుల సూచనలు పాటించాలని ఏవోలు శశిధర్ రెడ్డి వివరించారు.