బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లోని పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకుడు విన్నకోట సురేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేపట్టాలని పిలుపునిచ్చారు.