PLD: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రొంపిచర్లలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శంకరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.ఆలయ అర్చకులు శ్రీనివాసరావు స్వామికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి, పుట్ట దగ్గర పూజలు చేశారు.