ప్రకాశం: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టుదలతో చదివి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.