CTR: పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న మహిమాన్విత శక్తి స్వరూపిణి వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని అర్చకులు నామాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.