KDP: ఏలూరు జిల్లాలో SCలపై నాయకుల దాడిని ఖండిస్తూ ప్రొద్దుటూరులో రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం నాయకులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు రామోజీ ఇమ్మానియేల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. అనంతరం దళితులపై దాడులు పెరిగాయని, రక్షణ లేకుండా పోయిందన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.