ATP: ఈనెల 20న CM చంద్రబాబు 76వ జన్మదినోత్సవం నుంచి రాయదుర్గంలోని జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు కొనసాగుతున్నాయి. MLA కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తారా దేవి హోమంలో పాల్గొన్నారు. సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.