AP: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సీబీఐని ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలికితీయాలని ఆమె కోరుతున్నారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు దీనిని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.