NLR: ఆత్మకూరు(M) నెల్లూరు పాలెం ముస్లిం కాలనీలో పోలీసులు సోమవారం ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు. సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 3కార్లు, 4ఆటోలను సీజ్ చేశారు. కాలనీవాసులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలను వాడరాదని సీఐ గంగాధర్ సూచించారు.