SDPT: బెజ్జంకి మండలంలోని చిలాపూర్ ప్రాథమిక పాఠశాలలో కీర్తిశేషులు కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి గారి స్మారకార్థంగా వారి సతీమణి కొమ్మెర సులోచన రూ.10,000 విరాళం అందజేశారు. సర్పంచ్ శనగోండ స్వరూప, ఉప సర్పంచ్ రాదారం హరీష్, ఎంఈఓ మహతి లక్ష్మి సమక్షంలో ఈ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయులు రామంచ రవీందర్‌కు కొమ్మెర రామకృష్ణారెడ్డి, పవ్వాడి మల్లికార్జున అందించారు.